![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 91లో.. గాయత్రి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. జరిగిందంతా గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరోవైపు మాధవ, కన్నా గుడిలో ఎదురుచూస్తుంటారు.... వదిన వాళ్ళు ఇంకా రావడం లేదని కన్నా అంటాడు. కాసేపటికి మహా వాళ్ళు కార్ దిగి వస్తారు. గాయత్రి లేదేంటని మాధవ అనగానే కార్ లో ఉన్నట్లు ఉంది.. నిన్ను ఆటపట్టించడానికి అలా చేస్తున్నారు కావొచ్చు అని కన్నా అంటాడు. వాళ్లకి ఎదురుగా మాధవ వెళ్లి గాయత్రి ఎక్కడ అని అడుగుతాడు. రాలేదు.. రానంది అని మహా చెప్పగానే మాధవ షాక్ అవుతాడు.
అక్కడ జరిగిందంతా మహా చెప్తుంది. తప్పు చేసాను పెద్ది.. నా వల్లే ఇదంతా అని ఏడుస్తుంది. నువ్వు ఏం తప్పు చెయ్యలేదు.. గాయత్రి మోసం చేస్తే తప్పు నీదేలా అవుతుందని మాధవ అంటాడు. నన్ను క్షమించమని మహా చెప్తుంది. నువ్వు ఈ ప్రయత్నం చేసి మంచి పని చేసావ్.. ఎందుకు అంటే గాయత్రిని నేను వదులుకున్నాననే ఫీలింగ్ తో ఉండేవాడిని కానీ ఈ రోజుతో గాయత్రికే నేనంటే ఇష్టం లేదని తెలిసిందని మాధవ అంటాడు. అప్పుడే పంతులు గారు వచ్చి తాళి ఇస్తాడు. నువ్వు ఆ అమ్మాయి మెడలో కడితే భర్త అయ్యేవాడివి అంటే ఆ
యోగం లేదేమో అని పంతులు అంటాడు. దాంతో మాధవ బాధపడుతాడు. ఆ తర్వాత అందరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మహా ఏడుస్తూ గదిలో ఉంటుంది. మాధవ వెళ్లి తలుపు తియ్యమని రిక్వెస్ట్ చేస్తాడు. తలుపు తీసి మాధవ కాళ్ళపై మహా పడబోతు క్షమించమని అడుగుతుంది. అయ్యో వద్దమ్మా నువ్వు ఏం తప్పు చెయ్యలేదు నాపై గౌరవం ఉంటే ఈ విషయం మర్చిపోమని మహాతో మాధవ అంటాడు.
ఆ తర్వాత మహాని చక్రి పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. పెద్దికి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి. ఒక ఇంటివాడిని చెయ్యాలని మహా అంటుంది. ఆ తర్వాత నారాయణ టీ షాప్ దగ్గర ఉండగా గాయత్రిని చేసుకోవడానికి కొత్త సంబంధం వస్తుంది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు.. అమ్మాయి ఎలాంటిదో కనుక్కోవాలని నారాయణని అడుగతారు. తాయారు గయ్యాళి తనం గురించి నారాయణ చెప్తాడు. అప్పుడే మాధవ వచ్చి మీరేం మా నాన్న మాటలు పట్టించుకోకండి.. కళ్ళు మూసుకొని సంబంధం ఒకే చేసుకోండి.. గాయత్రి చాలా మంచి అమ్మాయి అని వాళ్లతో మాధవ చెప్తాడు. మీరు చాలా మంచి వారిలా ఉన్నారని చెప్పి వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోతారు. నారాయణ కోపంగా ఇంటికి వస్తాడు.. మహా వాళ్లతో అసలేం జరిగిందో మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |